Nagarjuna: 'బంగార్రాజు'లో రెండు ఐటమ్ సాంగ్స్!

  • 'బంగార్రాజు'గా నాగార్జున
  • సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
  • సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్    
Bangarraju Movie Update

నాగార్జున - నాగచైతన్య కాంబినేషన్లో 'బంగార్రాజు' సినిమా రూపొందుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో నాగ్ సరసన రమ్యకృష్ణ కనిపించనుండగా, చైతూ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. గ్రామీణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. మాస్ అంశాలు ఎక్కువగా ఉండేలా నాగార్జున చూసుకుంటున్నారు.

అందువల్లనే ఈ సినిమాలో జోరుగా .. హుషారుగా ఉండే పాటలకు ఆయన ప్రాధాన్యతనిచ్చారు. ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ను ఫరియా అబ్దుల్లాపై చిత్రీకరించారు. మరో ఐటమ్ సాంగ్ లో దక్షా నగార్కర్ (హుషారు .. హోరా హోరీ ఫేమ్) సందడి చేయనుందని అంటున్నారు. త్వరలోనే ఆ పాటను కూడా వదలనున్నారు.

అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ దిశగానే సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఆ కారణంగానే ఈ సినిమా నుంచి వెంటవెంటనే అప్ డేట్స్ వదులుతున్నారని చెబుతున్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, 'సోగ్గాడే చిన్నినాయనా' మాదిరిగా కొత్త  రికార్డులకు తెరదీస్తుందేమో చూడాలి.

More Telugu News