Vijay Devarakonda: 'లైగర్' రిలీజ్ డేట్ ఖరారు!

  • 'లైగర్'గా విజయ్ దేవరకొండ
  • అతిథి పాత్రలో మైక్ టైసన్
  • కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ
  • ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల
Liger movie updare

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమా రూపొందుతోంది. పూరి - చార్మీ నిర్మిస్తున్న ఈ సినిమాకి, కరణ్ జొహార్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పరంగా ఈ సినిమా చివరిదశకి చేరుకుంది.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేసి, అధికారిక పోస్టర్ ను వదిలారు. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషలలో ఆగస్టు 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నెల 31వ తేదీన ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఇది శుభవార్తే.

విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనుండగా, అతిథి పాత్రలో మైక్ టైసన్ కనిపించనున్నాడు. అనన్య పాండే ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది. కీలకమైన పాత్రల్లో రమ్యకృష్ణ, మకరంద్ దేశ్ పాండే కనిపించనున్నారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి..

More Telugu News