AP Govt: సినిమా టికెట్లపై హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం

  • సినిమా టికెట్ల ధరలు తగ్గించిన ఏపీ సర్కారు
  • ఇటీవల జీవో నెం.35 జారీ
  • హైకోర్టును ఆశ్రయించిన థియేటర్ల యాజమాన్యాలు
  • టికెట్ల రేట్లను ప్రభుత్వం నిర్ణయించలేదని వాదన
  • ఏకీభవించిన హైకోర్టు
AP Govt decides to challenge high court verdict on cinema tickets

ఇటీవల ఏపీలో సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. అయితే సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను నేడు హైకోర్టు కొట్టివేసింది. పాత పద్ధతిలోనే టికెట్ల అమ్మకానికి పచ్చజెండా ఊపింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

సామాన్య ప్రజల ప్రయోజనం రీత్యా ఏపీలో సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం ఇటీవల భారీగా తగ్గించింది. ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకం విధానం తీసుకువచ్చింది. దీనికి సంబంధించి జీవో నెం.35 జారీ చేసింది.

అయితే థియేటర్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించగా, వారు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు నేడు విచారించింది. థియేటర్లలో టికెట్ల ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదన్న థియేటర్ల యాజమాన్యాల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. హైకోర్టు తీర్పుతో సంక్రాంతి బరిలో వచ్చే సినిమాలకు భారీగా లబ్ది చేకూరనుంది.

More Telugu News