Nani: 'శ్యామ్ సింగ రాయ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!

  • 'శ్యామ్ సింగ రాయ్'గా నాని
  • బెంగాలీ యువతిగా సాయిపల్లవి
  • ఈ నెల 14వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
  • వరంగల్ 'రంగలీల మైదాన్'లో వేడుక     
Shyam Singha Roy movie update

నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' సినిమా రూపొందింది. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 14వ తేదీన వరంగల్ 'రంగలీల మైదాన్'లో ఈ వేడుకను నిర్వహించనున్నారు.

ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ మొదలుకానుంది. మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. 70వ దశకంలో కలకత్తా నేపథ్యంలో జరిగే కథ ఇది. అందుకే కలకత్తాకి 400 కిలోమీటర్ల దూరంలోని ఒక గ్రామంలో కూడా కొంత షూటింగ్ చేశారు.

ఈ సినిమాలో నాని కథకి తగినట్టుగా డిఫరెంట్ గెటప్పులో కనిపిస్తాడు. అలాగే సాయిపల్లవి కూడా బెంగాలీ యువతి లుక్ తో ఆకట్టుకుంటోంది. మిగతా నాయికలుగా కృతిశెట్టి .. మడోన్నా అలరించనున్నారు. సిరివెన్నెల పాటలు ..  మిక్కీ జె మేయర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణలుగా నిలవనున్నాయి. 

More Telugu News