Junior NTR: మహేశ్ తో సినిమా గురించి అలా స్పందించిన రాజమౌళి!

  • రిలీజ్ కి రెడీగా 'ఆర్ ఆర్ ఆర్'
  • ప్రమోషన్స్ లో బిజీగా రాజమౌళి
  • అదే పనిలో ఎన్టీఆర్ .. చరణ్
  • ఇప్పుడు ఆ టాపిక్ వద్దన్న రాజమౌళి    
RRR movie update

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' విడుదలకు రెడీ అవుతోంది. జనవరి 7వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా, భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

రాజమౌళితో పాటు ఎన్టీఆర్ .. చరణ్ ఇద్దరూ కూడా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మహేశ్ బాబుతో సినిమా గురించి చెప్పమంటూ రాజమౌళికి ఒక ప్రశ్న ఎదురైంది. ఆయన తదుపరి సినిమా మహేశ్ తో ఉండనుందని ప్రచారం జరుగుతూ ఉండటంతో, ఆయనను ఈ ప్రశ్న అడిగారు.

ఆ ప్రాజెక్టు గురించి ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదనీ, ఈ సినిమా సక్సెస్ అయిన తరువాత ఆ సినిమాను గురించి మాట్లాడుకుందామని రాజమౌళి సమాధానమిచ్చారు. మహేశ్ తో ప్రాజెక్టు గురించి రాజమౌళి ఏం మాట్లాడినా, ఆ విషయం హాట్ టాపిక్ గా మారిపోతుంది. జనం దృష్టి 'ఆర్ ఆర్ ఆర్ ' నుంచి పక్కకి పోతుంది. అందువలన రాజమౌళి తెలివిగా అలా సమాధానం ఇచ్చారు. నిలకడగా ఉంటూ నిబ్బరంగా వ్యవహరించడమే రాజమౌళి ప్రత్యేకత మరి!

More Telugu News