Cricket: అభిమానులను చల్లబరిచేందుకు కెప్టెన్ గా కోహ్లీ మరపురాని ఇన్నింగ్స్ లను గుర్తు చేసిన బీసీసీఐ.. ఇదిగో వీడియో

  • ఇటీవల కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ
  • మండిపడుతున్న అభిమానులు
  • ఇంగ్లండ్ పై కోహ్లీ మాస్టర్ క్లాస్ అంటూ బీసీసీఐ వీడియోలు
BCCI Relives The Master Class Of King Kohli

సచిన్ టెండూల్కర్ తర్వాత భారత క్రికెట్ లో అంతటి చెరిగిపోని ముద్ర వేసిన క్రికెటర్ విరాట్ కోహ్లీ! అన్నీ బాగానే జరుగుతున్నాయనుకుంటున్న టైంలో అతడి కెప్టెన్సీకే ఎసరు పడింది. వైట్ బాల్ క్రికెట్ లో అతడిని కెప్టెన్సీ నుంచి బీసీసీఐ నిర్దయగా తప్పించేసింది. దీనిపై కింగ్ కోహ్లీ అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే బీసీసీఐని ఏకిపారేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, అభిమానులను చల్లబరిచేందుకు బీసీసీఐ కోహ్లీ గత బ్యాటింగ్ రికార్డులను గుర్తు చేసింది. కెప్టెన్ గా ఎన్నో మరపురాని ఇన్నింగ్స్ ఆడాడని పేర్కొంది.  అలాంటి ఇన్నింగ్స్ లలో కొన్నింటిని పోస్ట్ చేసింది. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తో పూణేలో కోహ్లీ కెప్టెన్ గా తన మార్కు ఎంట్రీని ఇచ్చాడంటూ ట్వీట్ చేసింది. 2017లో ఇంగ్లండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లోని మొదటి మ్యాచ్ లో సెంచరీ బాదిన (105 బంతుల్లో 122) ఇన్సింగ్స్ ను గుర్తు చేసింది. ఆ మ్యాచ్ లో ఇంగ్లండ్ నిర్దేశించిన 351 పరుగుల భారీ టార్గెట్ ను భారత్ కేవలం 48.1 ఓవర్లలోనే ఛేదించింది.

2018లో వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్ లోనూ తొలి మ్యాచ్ లో 107 బంతుల్లోనే 140 పరుగులు చేసిన ఇన్నింగ్స్ నూ గుర్తు చేసింది. ఆ మ్యాచ్ లో రోహిత్ శర్మ కూడా చెలరేగి ఆడి 117 బంతుల్లోనే 152 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్ లకు సంబంధించిన వీడియోలను మీరూ ఓ లుక్కేసేయండి మరి.


More Telugu News