Omicron: ఒమిక్రాన్ ఎఫెక్ట్: అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధాన్ని పొడిగించిన భారత్

  • వచ్చే ఏడాది జనవరి 31 వరకు నిషేధం పొడిగింపు
  • ఉత్తర్వులు జారీ చేసిన డీజీసీఏ
  • ఈ నెల 15 నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు ప్రారంభిస్తామని తొలుత ప్రకటన
  • ఒమిక్రాన్ నేపథ్యంలో నిర్ణయం వెనక్కి
Intl flight services suspended till january 31st

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను భయపెడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని భారత్ మరోమారు పొడిగించింది. ప్రస్తుతం ఉన్న తాత్కాలిక నిషేధాన్ని వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగిస్తూ పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.

నిజానికి ఈ నెల 15 నుంచి అంతర్జాతీయ ప్రయాణాలను పునరుద్ధరించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అయితే, దక్షిణాఫ్రికా, బోట్స్ వానాలలో ఒమిక్రాన్ అనే మరో కొత్త వేరియంట్ పురుడు పోసుకోవడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. తాజాగా నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

More Telugu News