Balakrishna: 'అఖండ' కథ కోసం బాలీవుడ్ బడా హీరోల పోటీ!

  • ఎక్కడ చూసినా 'అఖండ' నామస్మరణే
  • ఓవర్సీస్ లోను అదే దూకుడు
  • మరోసారి విజృంభించిన బాలయ్య
  • రీమేక్ హక్కులకు పెరుగుతున్న డిమాండ్
Akhanda movie update

బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ, కొంతకాలంగా ఆయన సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అది ఇప్పుడు 'అఖండ' రూపంలో వచ్చింది. బాక్సాఫీసును షేక్ ఆడించే సినిమా అయిందిది.

గతంలో బాలకృష్ణకి బి.గోపాల్ బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. కానీ బాలయ్యను లుక్ పరంగా కూడా కొత్తగా చూపిస్తూ బోయపాటి తన ప్రత్యేకతను ఇందులో చాటుకున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' ఇప్పుడు భారీ వసూళ్లను కొల్లగొడుతూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను అదే దూకుడు చూపుతుండటం విశేషం.

చాలాకాలం తరువాత ఓవర్సీస్ లోను సందడి చేస్తున్న బాలయ్య సినిమా ఇదే. ఈ సినిమా జోరు చూసిన బాలీవుడ్ హీరోలు ఇప్పుడు దీనిపై కన్నేశారట. ఈ సినిమా రీమేక్ హక్కులు దక్కించుకోవడానికి ఇద్దరు బడా హీరోలు పోటీపడుతున్నారని అంటున్నారు. భారీ ఆఫర్ తో ముందుకు వచ్చి సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ అయితే బలంగానే వినిపిస్తోంది. వాళ్లలో ఈ కథ ఎవరికి దక్కుతుందో చూడాలి.

More Telugu News