Omicron: ’ఒమిక్రాన్’కు మా మందు బాగా పనిచేస్తోంది: గ్లాక్సో స్మిత్ క్లైన్

  • ’సొట్రోవిమ్యాబ్’ ఔషధంతో యాంటీబాడీ చికిత్స
  • ఒమిక్రాన్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోందన్న జీఎస్‌కే
  • కరోనాలోని 37 వేరియంట్లపైనా ప్రభావం
GlaxoSmithKline devoleped drug for omicron

ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్‌కు అడ్డుకట్ట వేసేందుకు తాము ఔషధాన్ని అభివృద్ధి చేసినట్టు ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్లాక్సో స్మిత్ క్లైన్ (జీఎస్‌కే) వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్‌పై ఇది చక్కగా పనిచేస్తోందని తెలిపింది. అమెరికాలోని తన భాగస్వామి అయిన వీర్ బయోటెక్నాలజీతో కలిసి ‘సొట్రోవిమ్యాబ్’ అనే ఔషధంతో యాంటీబాడీ చికిత్సను ఆవిష్కరించినట్టు తెలిపింది.

ఈ యాంటీబాడీ చికిత్స ఒమిక్రాన్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు వివరించింది. అంతేకాదు.. ఇప్పటి వరకు గుర్తించిన 37 రకాల కరోనా వేరియంట్లపై ఈ ఔషధం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు తేలిందని గ్లాక్సో పేర్కొంది. అయితే, క్లినికల్ పరీక్షల్లో వెల్లడైన ఫలితాలను అగ్రశ్రేణి మెడికల్ జర్నల్స్ పీర్ రివ్యూ చేయాల్సి ఉంది.

More Telugu News