Natu Natu: ఆర్ఆర్ఆర్ 'నాటు నాటు' పాటకి రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్లు డాన్స్ చేస్తే... ఇలా ఉంటుంది!

  • రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్
  • ఇటీవలే ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు పాట రిలీజ్
  • దుమ్మురేపిన ఎన్టీఆర్, రామ్ చరణ్
  • రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ల ముఖాల మార్ఫింగ్ తో వీడియో
Rajasthan Royals share a video of Natu Natu song from RRR

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన 'నాటు నాటు' పాట సూపర్ హిట్టయింది. ఈ పాటలో తారక్, చెర్రీ పోటీ పడి మరీ డ్యాన్స్ చేయడం చూడొచ్చు. అయితే ఈ పాటకు రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ జట్టు ఆటగాళ్లు జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ ముఖాలను మార్ఫింగ్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

ఈ వీడియోను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ట్విట్టర్ లో పంచుకుంది. ఆర్ఆర్ఆర్ లో ఆర్ఆర్ (రాజస్థాన్ రాయల్స్) అంటూ ఈ వీడియోపై కామెంట్ చేసింది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేషరీతిలో స్పందన వస్తోంది.

More Telugu News