Team India: భారత్ ను దెబ్బతీసిన అజాజ్ పటేల్... 80 పరుగుల వద్ద 3 వికెట్లు డౌన్

  • ముంబయిలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • గిల్ 44 అవుట్
  • పుజారా, కోహ్లీ డకౌట్
  • మూడు వికెట్లు అజాజ్ పటేల్ కే!
Team India lost three quick wickets in Mumbai test

ముంబయిలో న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నిర్ణయానికి తగ్గట్టుగానే ఓపెనర్లు తొలి వికెట్ కు 80 పరుగులు జోడించి శుభారంభం అందించారు.

అయితే కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఒక్కసారిగా ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేశాడు. తొలుత ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (44)ను అవుట్ చేసిన అజాజ్ పటేల్... తన తదుపరి ఓవర్లో ఏకంగా చటేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీలను అవుట్ చేసి టీమిండియాను దెబ్బతీశాడు. పుజారా, కోహ్లీ కనీసం ఒక్క పరుగు కూడా చేయకుండానే నిష్క్రమించారు. దాంతో భారత్ 80 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయింది.

ప్రస్తుతం టీమిండియా స్కోరు 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు కాగా... క్రీజులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (42 బ్యాటింగ్), శ్రేయాస్ అయ్యర్ (1 బ్యాటింగ్) ఆడుతున్నారు. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది.

More Telugu News