Samantha: నాపై ఇంత ప్రేమ కురిపిస్తున్నందుకు థ్యాంక్యూ: స‌మంత పోస్ట్

  • ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియ‌న్లకు చేరిన ఫాలోవ‌ర్ల సంఖ్య‌
  • ఈ విష‌యాన్ని తెలుపుతూ స‌మంత సంబ‌రం
  • సామాజిక మాధ్య‌మాల్లో దూసుకుపోతోన్న హీరోయిన్
Samantha emotional post

సామాజిక మాధ్య‌మాల్లో సమంతకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పే అవ‌స‌రం లేదు. సామాజిక మాధ్య‌మాల్లో తగ్గేదే లే అంటూ సమంత మ‌రింత దూసుకుపోతోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవ‌ర్ల సంఖ్య 20 మిలియ‌న్ల‌కు పెరిగింద‌ని, త‌న‌పై ఇంత ప్రేమ కురిపిస్తున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాన‌ని పేర్కొంది.

స‌మంతకు సాధార‌ణంగానే సామాజిక మాధ్య‌మాల్లో ఫాలోయింగ్ ఎక్కువ‌. నాగ‌చైత‌న్య‌తో ఆమె విడిపోయాక ఆ ఫాలోయింగ్ మ‌రింత పెరిగిపోయింది. ఆమె ప‌దే ప‌దే వార్త‌ల్లో నిలుస్తోంది. ప్ర‌స్తుతం ఆమె చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. పుష్ప సినిమాలో ఐటం సాంగ్‌లోనూ డ్యాన్స్ చేసింది. స‌మంత ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవ‌ర్ల సంఖ్య 2 కోట్ల‌కు చేర‌గా,  రష్మిక మంధనా ఫాలోవ‌ర్ల సంఖ్య 2.4 కోట్లుగా ఉంది. ఇక‌ కాజల్‌ అగర్వాల్ కు 2.2 కోట్ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు.

           

More Telugu News