omicron: ఆందోళన పడాల్సిన స్థాయిలో ఒమిక్రాన్‌ తీవ్రత లేదు: విజ‌య‌సాయిరెడ్డి

  • కర్ణాటకలో 2 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు
  • 46 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్
  • పరిశోధన కేంద్రాల్లో అధ్యయనం జరుగుతోంది
vijaya sai on corona new variant

క‌రోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ భారత్‌లోకీ ప్ర‌వేశించింద‌ని నిన్న కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కర్ణాట‌క‌లో ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వెల్లడించింది. భార‌త్‌లో గుర్తించిన తొలి కేసులు ఇవేనని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నాయి. ఆ వేరియంట్ ప్ర‌బ‌ల కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాయి. దీనిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు.

కర్ణాటకలో 2 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను గుర్తించిన తర్వాత పెద్దగా ఆందోళన పడాల్సిన స్థాయిలో వ్యాధి తీవ్రత లేదని కేంద్రం వెల్లడించిందని విజ‌య‌సాయిరెడ్డి గుర్తు చేశారు. 46 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ పై పరిశోధన కేంద్రాల్లో అధ్యయనం జరుగుతోందని ఆయ‌న చెప్పారు. జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి బారిన పడకుండా రక్షించుకోవచ్చని అన్నారు.

More Telugu News