Omicron: ఒమిక్రాన్ నేపథ్యంలో టీఎస్ ప్రభుత్వం అలర్ట్.. మళ్లీ ఆంక్షలు విధించే అవకాశం!

  • ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తోన్న ఒమిక్రాన్
  • కొవిడ్ నిబంధనలను కఠినతరం చేయాలని యోచిస్తున్న ప్రభుత్వం
  • విద్యాసంస్థల పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశం
TS govt alert amid Omicron

కరోనా కొత్త వేరియంట్ మన దేశంలో కూడా భయాందోళనలను పెంచుతోంది. అత్యంత వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందనే వైద్య నిపుణుల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒమిక్రాన్ పై అలర్ట్ అయింది. మరోసారి ఆంక్షలు విధించే యోచనలో ఉంది. ట్యాంక్ బండ్, చార్మినార్ ల వద్ద నిర్వహించే ఫన్ డే ను రద్దు చేసింది.

సినిమా థియేటర్లు, మాల్స్, పబ్స్, మార్కెట్లు తదితర ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలను కఠినతరం చేయాలని భావిస్తోంది. స్కూళ్లు, కాలేజీలలో పరిస్థితులపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కాపేపట్లో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ మీడియా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు.

More Telugu News