Allu Arjun: 'పుష్ప' నుంచి మరో పవర్ఫుల్ పోస్టర్!

  • అడవి నేపథ్యంలో సాగే కథ
  • మాస్ ను ఊపేస్తున్న సాంగ్స్
  • ఉత్కంఠను పెంచే ఫైట్స్
  • డిసెంబర్ 17న భారీ రిలీజ్  
Pushpa movie update

మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ కథాకథనాలతో పాటు, తన లుక్ కి కూడా ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఉంటాడు. సినిమా .. సినిమాకి తాను కొత్తగా కనిపించడానికీ .. కథకి తగినట్టుగా అనిపించడానికి ఉత్సాహాన్ని చూపుతుంటాడు. ఆయన పాత పోస్టర్స్ పై ఆయన లుక్ చూసి, అది ఏ సినిమాలోదో చెప్పేయవచ్చు. అంతగా ఆయన తన లుక్ ను సెట్ చేసుకుంటాడు.

అలాగే 'పుష్ప' సినిమాలోను ఆయన డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. అసలు ఆయన లుక్ తోనే ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను వదిలారు. అడవి నేపథ్యంలో ఎర్ర చందనం దుంగలపై 'గన్' పట్టుకుని కూర్చుని ఆయన కనిపిస్తున్నాడు.

అప్పటికే పోరాడి అలసిపోయిన ఆయన, ఇక తెగించి 'ఎవరొస్తారో రండిరా ..' అన్నట్టుగా చూస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పడానికి నిదర్శనంగా ఈ ఒక్క పోస్టర్ ను చూపించవచ్చు. ఇప్పటికే ఈ  సినిమా సాంగ్స్ పరంగా మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేస్తోంది. ఈ నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది.

More Telugu News