SCR: నెల్లూరు-పడుగుపాడు మార్గంలో 6 రైళ్లను పునరుద్ధరించిన దక్షిణ మధ్య రైల్వే

  • ఇటీవల భారీ వర్షాలు, వరదలు
  • నెల్లూరు జిల్లా పడుగుపాడు వద్ద రైల్వే ట్రాక్ ధ్వంసం
  • నిలిచిన పలు రైళ్ల రాకపోకలు
  • యుద్ధప్రాతిపదికన ట్రాక్ మరమ్మతులు
SCR revives six trains

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు నెల్లూరు జిల్లా పడుగుపాడు వద్ద రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. దాంతో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే నేడు 6 రైళ్లను పునరుద్ధరించింది. నేటి తిరుపతి-హజరత్ నిజాముద్దీన్ (12707) ఎక్స్ ప్రెస్ రైలు యథాతథంగా నడుస్తుందని తెలిపింది. నేటి చెన్నై సెంట్రల్-ముంబయి సీఎస్ఎంటీ (22160).. ముంబయి సీఎస్ఎంటీ-చెన్నై సెంట్రల్ (22159) రైళ్లను పునరుద్ధరించినట్టు పేర్కొంది.

నేటి చెన్నై సెంట్రల్-అహ్మదాబాద్ (22919) రైలును పునరుద్ధరించినట్టు వివరించింది. చెన్నై సెంట్రల్-ముంబయి ఎల్టీటీ (12164).. ముంబయి ఎల్టీటీ-చెన్నై సెంట్రల్ (12163) రైళ్లను పునరుద్ధరించినట్టు తెలిపింది.

More Telugu News