ICMR: కరోనా కట్టడికి బూస్టర్ డోసు అవసరమా?.. కానేకాదంటున్న ఐసీఎంఆర్ డైరెక్టర్

  • బూస్టర్ డోసు అవసరమన్న దానికి శాస్త్రీయ ఆధారాలు లేవన్న బలరాం భార్గవ
  • అర్హులకు రెండో డోసు వేయించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
  • బూస్టర్ డోసుపై త్వరలోనే సమావేశం కానున్న ఎన్‌టీఏఐజీ
No scientific evidence to support need for Covid booster dose

కరోనా మహమ్మారి నుంచి మరింత రక్షణ కోసం రెండు డోసులు తీసుకున్నవారు కూడా బూస్టర్ డోసు తీసుకోవాలంటూ వస్తున్న వార్తలపై ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ స్పందించారు. బూస్టర్ డోసుతో శరీరానికి మరింత రక్షణ లభిస్తుందన్న వార్తలను ఆయన కొట్టిపడేశారు. కొవిడ్ నుంచి రక్షణకు బూస్టర్ డోసు అవసరమన్న దానికి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు.

దేశంలోని అర్హులందరికీ రెండో డోసు వేయించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. దేశంలో బూస్టర్ డోసు ఇచ్చే విషయమై చర్చించేందుకు భారత్‌లో టీకా కార్యక్రమంపై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టీఏజీఐ) త్వరలో చర్చించనున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఇప్పటికే పలు దేశాలు తమ పౌరులకు బూస్టర్ డోసులు ఇస్తుండగా, మరికొన్ని అదే ప్రయత్నంలో ఉన్నాయి.

More Telugu News