Chandrababu: అసెంబ్లీ మార్షల్ ఓవరాక్షన్.. అదుపులోకి తీసుకున్న చంద్రబాబు భద్రతాసిబ్బంది!

  • శాసనసభలోకి చంద్రబాబు వెళ్తుండగా ఫోన్ తో విజువల్ షూట్ చేసిన మార్షల్
  • మార్షల్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది
  • చంద్రబాబుకు క్షమాపణ చెప్పిన చీఫ్ మార్షల్
Chandrababu security anger on marshal

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ మార్షల్ ఓవరాక్షన్ చేశారు. శాసనసభలోకి చంద్రబాబు ఇతర కీలక నేతలతో కలిసి వెళ్తుండగా సదరు మార్షల్ ఫోన్ తో విజువల్ షూట్ చేశాడు. దీన్ని గమనించిన చంద్రబాబు సెక్యూరిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే చంద్రబాబు వద్దకు చీఫ్ మార్షల్ వచ్చి క్షమాపణ చెప్పారు. మార్షల్ చర్యపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.  

More Telugu News