Nithin: నితిన్ సినిమా షూటింగులో జాయినైన కేథరిన్!

  • కొత్త దర్శకుడితో 'మాచర్ల నియోజకవర్గం'
  • ఒక కథానాయికగా కృతి శెట్టి
  • మరో నాయికగా కేథరిన్
  • ఏప్రిల్ 29వ తేదీన సినిమా రిలీజ్  
Macharla Niyojakavargam movie update

కేథరిన్ కి ఇంతవరకూ సరైన సినిమా .. సరైన పాత్ర పడలేదనే చెప్పాలి. అయినా ఆమెకి అభిమానుల సంఖ్య ఎక్కువే. నేరేడు పండ్లలాంటి ఆమె కళ్లను ఇష్టపడేవారు ఎంతోమంది ఉన్నారు. 'ఇద్దరమ్మాయిలతో' .. 'సరైనోడు' సినిమాలు ఆమెకి కాస్త గుర్తింపు తెచ్చాయి. 'నేనేరాజు నేనే మంత్రి' హిట్ తో ఆమె దార్లో పడుతుందని అంతా అనుకున్నారు.

కానీ అలా జరగలేదు .. ఆ తరువాత ఆమె చేసిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా అంతగా ఆడలేదు. కాకపోతే ఆమె గ్లామర్ కి పడవలసిన మార్కులు ఆమెకి పడిపోయాయి. అందువల్లనే 'భళా తందనాన' .. 'బింబిసారా' సినిమాల్లో అవకాశాలను దక్కించుకోగలిగింది. ఇక తాజాగా ఆమె నితిన్ తోను ఒక సినిమా చేస్తోంది.

నితిన్ తాజా చిత్రంగా ఆయన సొంత బ్యానర్లో 'మాచర్ల నియోజక వర్గం' రూపొందుతోంది. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఒక కథానాయికగా కృతి శెట్టిని .. మరో కథానాయికగా కేథరిన్ ను ఎంపిక చేసుకున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగులో కేథరిన్ జాయినైంది. ఆమెకి వెల్ కమ్ చెబుతూ టీమ్ ఒక పోస్టర్ ను వదిలింది. ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News