Trisha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కాజల్ స్థానంలో త్రిష వస్తోందా?
  • చిరు, సల్మాన్ కోసం మాస్ ట్యూన్
  • 'అహం రీబూట్' అంటున్న సుమంత్  
Trisha replaces Kajal in Indian sequel

*  కమలహాసన్, శంకర్ కలయికలో రూపొందుతున్న 'ఇండియన్ 2' చిత్రం నుంచి కథానాయిక కాజల్ తప్పుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఆమె గర్భవతి కావడంతో ఈ చిత్రాన్ని వదులుకుందనీ, ఆమె స్థానంలో మేకర్స్ త్రిషను తీసుకున్నారని తాజా సమాచారం.
*  మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న 'గాడ్ ఫాదర్' చిత్రంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఓ అతిథి పాత్ర పోషించనున్నట్టుగా ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఇందులో చిరంజీవి, సల్మాన్ పై ఓ మాస్ పాట ఉందనీ, అందుకోసం సంగీత దర్శకుడు తమన్ మాంచి ట్యూన్ సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది.
*  సుమంత్ హీరోగా తాజాగా 'అహం రీబూట్' పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నిన్న హైదరాబాదులో లాంఛనంగా మొదలైంది. ఇందులో సుమంత్ ఆర్జేగా కనిపిస్తాడని దర్శకుడు తెలిపారు.

More Telugu News