Austria: కేవలం వారి కోసమే ఆస్ట్రియాలో మళ్లీ లాక్ డౌన్!

  • ఆస్ట్రియాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
  • వ్యాక్సిన్ తీసుకోని వారికి లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం
  • టీకా తీసుకోని వారు బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
Austria imposes lockdown for those not taken vaccine

కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలన్నీ అల్లాడిపోయాయి. దీంతో అన్ని దేశాలు కఠినమైన ఆంక్షలు విధించి కరోనా వ్యాప్తిని నిలువరించే ప్రయత్నం చేశాయి. యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్లు వేశాయి. ఈ క్రమంలో అనేక దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. యూరప్ లోని ఆస్ట్రియాలో కూడా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దేశ వ్యాప్తంగా 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్టు ఆస్ట్రియా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ లాక్ డౌన్ అందరికీ కాదు. కేవలం వ్యాక్సిన్ తీసుకోని వారికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్ తీసుకోని వారు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆ దేశంలో ఇప్పటి వరకు కేవలం 65 శాతం మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు.

More Telugu News