Amit Shah: శ్రీవారి సేవలో కేంద్రమంత్రి అమిత్ షా, వైఎస్ జగన్

  • 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు తిరుపతి చేరుకున్న అమిత్ షా
  • షా, జగన్‌లకు మహాద్వారం వద్ద స్వాగతం
  • ప్రముఖుల రాకతో కోలాహలంగా మారిన తిరుపతి
Amit Shah and Jagan visited Tirumala

తిరుపతిలో నిర్వహిస్తున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, వేదపండితులు మహాద్వారం వద్ద వీరికి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న షా, జగన్‌కు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు. టీటీడీ చైర్మన్, ఈవోలు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలతో పాటు కాఫీ టేబుల్‌ బుక్, 2022 డైరీ, క్యాలెండర్, టీటీడీ అగరబత్తులను అందజేశారు. అంతకు ముందు పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న అమిత్‌ షా, జగన్‌కు మంత్రి వెలంపల్లి, అధికారులు స్వాగతం పలికారు.

కాగా, 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం జగన్‌, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎం.రంగస్వామి, లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ పటేల్, అండమాన్‌ నికోబార్‌ ఐలండ్స్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అడ్మిరల్‌ డి.కులానంద్‌ జోషి, పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి రుబీనా ఆలీ, తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ, సీఎస్‌ సోమేశ్‌ హాజరు తదితరులు పాల్గొనున్నారు. పలువురు ప్రముఖ రాకతో తిరుపతి కోలాహలంగా మారింది.

More Telugu News