Balakrishna: రేపు 'అఖండ' నుంచి ట్రైలర్ రిలీజ్!

  • బోయపాటి నుంచి మరో యాక్షన్ మూవీ 
  •  డిఫరెంట్ లుక్స్ తో బాలకృష్ణ 
  • ప్రతినాయకుడిగా శ్రీకాంత్ 
  • డిసెంబర్లో రిలీజ్ చేసే ఛాన్స్
Akhanda trailer will release tomorrow

బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో 'అఖండ' సినిమా రూపొందింది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో, బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 2వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.

రేపు రాత్రి 7:09 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారిక పోస్టర్ ద్వారా తెలియజేశారు. కథానాకయికగా ప్రగ్యా జైస్వాల్ అలరించనుంది. ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను శ్రీకాంత్ పోషించగా, కీలకమైన పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి.

More Telugu News