Allu Sirish: అలా సస్పెన్స్ లో పెట్టేసిన అల్లు శిరీష్!

  • కూల్ గా సినిమాలు చేస్తున్న అల్లు శిరీష్
  • ప్రస్తుతం చేస్తున్న సినిమా 'ప్రేమకాదంట'
  • త్వరలో మరో ప్రాజెక్టు మొదలు
  • స్క్రిప్ట్ తెగ నచ్చేసిందంటున్న శిరీష్  
Allu Sirish upcoming movie

అల్లు శిరీశ్ .. యూత్ కి ఈ పేరు బాగానే తెలుసు. హీరోగా ఆయన తన కెరియర్ ను మొదలుపెట్టేసి ఏడేళ్లు దాటిపోయింది.  ఇంతవరకూ చేసింది 6 సినిమాలే. వాటిలో కాస్త చెప్పుకోదగిన సినిమా ఏదైనా ఉందంటే అది 'శ్రీరస్తు శుభమస్తు'నే. అంతకు ముందుగానీ .. ఆ తరువాత గాని ఆయన చేసిన సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోలేదు.

ఇంతవరకూ శిరీష్ చాలా తాపీగా సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ ఇకపై ఆయన తన జోరును పెంచాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన 'ప్రేమకాదంట' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ అలరించనుంది. ఈ సినిమా తరువాత ఆయన మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెప్పాడు.

ఇది తన కెరియర్లోనే బెస్ట్ స్క్రిప్ట్ అని అన్నాడు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పనుల్లో తాను బిజీగా ఉన్నానని చెప్పాడు. అయితే ఎవరి దర్శకత్వంలో .. ఏ బ్యానర్లో చేయనున్నాడు? ఎప్పుడు పట్టాలపైకి పరిగెత్తనున్నాడు? అనే విషయాలు చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టేశాడు.

More Telugu News