Andhra Pradesh: ఆర్బీఐ నుంచి మరో వెయ్యి కోట్ల అప్పు తీసుకున్న ఏపీ ప్రభుత్వం

  • సెక్యూరిటీ బాండ్లను వేలం వేసిన ఏపీ
  • 7 శాతం వడ్డీరేటుతో రుణ సేకరణ
  • కేంద్ర రుణ పరిమితిలో మిగిలి ఉన్నది రూ. 150 కోట్లు మాత్రమే
AP govt takes Rs 1000 Cr credit from RBI

ఏపీ ప్రభుత్వం మరోసారి ఆర్బీఐ నుంచి అప్పు తీసుకుంది. ఆర్బీఐ వద్ద తమ సెక్యూరిటీ బాండ్లను వేలం వేయడం ద్వారా ఏపీ వెయ్యి కోట్లను సేకరించింది. ఈ వేలంపాటలో ఐదు రాష్ట్రాలు పాల్గొన్నాయి. కాగా, ఏపీ ప్రభుత్వం అత్యధికంగా 7 శాతం వడ్డీని చెల్లించిమరీ రుణాన్ని సొంతం చేసుకుంది. ఈ తాజా అప్పుతో ఏపీకి కేంద్రం ఇచ్చిన రుణ పరిమితిలో మరో రూ. 150 కోట్లు మాత్రమే మిగిలాయి. అదనపు రుణ పరిమితి కోసం ఏపీ ఆర్థికశాఖ మంత్రి, అధికారులు కేంద్రాన్ని కోరుతున్నారు.

More Telugu News