Bhupesh Baghel: ఛత్తీస్ గఢ్ లో వింత ఆచారం... కొరడా దెబ్బలు కొట్టించుకున్న ముఖ్యమంత్రి!

  • దీపావళి తర్వాత గోవర్ధన పూజ
  • పూజలో భాగంగా కొరడా దెబ్బలు
  • కొరడాతో కొట్టించుకుంటే విఘ్నాలు తొలగిపోతాయని నమ్మిక
  • గతేడాది కూడా పూజలో పాల్గొన్న సీఎం భగేల్
CM Bhupesh Baghel attends Govardhana Pooja

ప్రతి ఏడాది దీపావళి తర్వాత ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో గోవులకు గోవర్ధన పూజ నిర్వహిస్తారు. దుర్గ్ జిల్లాలోని జజన్ గిరి అనే గ్రామంలో గోవర్ధన పూజ సందర్భంగా కొరడా దెబ్బలు తినడం ఎప్పటినుంచో వస్తోంది. నేడు జజన్ గిరి గ్రామంలో ఈ పూజ నిర్వహించగా, సీఎం భూపేశ్ భగేల్ కూడా హాజరయ్యారు. గోవర్ధన పూజలో పాల్గొన్న ఆయన ఆ వింత ఆచారాన్ని పాటించారు. కొరడాతో 8 పర్యాయాలు కొట్టించుకున్నారు.

ఆయన గతేడాది కూడా ఈ పూజా కార్యక్రమాలకు విచ్చేశారు. కొరడా దెబ్బలు తింటే దైవ కృప లభిస్తుందన్నది అక్కడి వారి నమ్మకం. తాను కూడా ఈ వింత ఆచారాన్ని నమ్ముతానని సీఎం భగేల్ వెల్లడించారు. రాష్ట్ర ప్రజల క్షేమాన్ని కోరి కొరడా దెబ్బలు తిన్నానని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

More Telugu News