Ayodhya: దీపాల వెలుగులో సరయు నదీ సోయగం... గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన అయోధ్య నగరం

  • దీపావళి సందర్భంగా నగరంలో 9 లక్షలకు పైగా దీపాలు
  • సరయు నదీ తీరంలో దీపోత్సవం
  • వరుసగా ఐదో ఏడాది కూడా రికార్డు
  • సర్టిఫికెట్ అందజేసిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు
Ayodhya city entered into Guinness Book

దీపావళి సందర్భంగా అయోధ్య నగరం దీపకాంతులతో వెలుగులు విరజిమ్మింది. అంతేకాదు, ప్రపంచ రికార్డు కూడా సాధించింది. 9 లక్షలకు పైగా దీపాలతో అయోధ్య నగరం గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. దీపావళిని పురస్కరించుకుని ఇక్కడి సరయు నదీ తీరంలో దీపోత్సవం ఏర్పాటు చేశారు. ఒక్కసారే లక్షల దీపాలు ప్రజ్వలనం చేయడంతో ఆ ప్రాంతమంతా కన్నుల పండువలా మారింది.

ఇక్కడి రామ్ కీ పైడీ ప్రాంతంలో ఇలా చమురుతో దివ్వెలు వెలిగించడం వరుసగా ఐదోసారి కూడా గిన్నిస్ రికార్డు పుటల్లోకెక్కింది. గిన్నిస్ బుక్ ప్రతినిధుల బృందం సమక్షంలో ఈ దీపోత్సవం నిర్వహించారు. రికార్డు సాధించినట్టు నిర్ధారించిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఆ మేరకు ధ్రువీకరణ పత్రం అందజేశారు.

More Telugu News