Deepavali Village: ఏపీలో దీపావళి అనే ఊరు ఎక్కడుందో తెలుసా?

  • ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న దీపావళి గ్రామం
  • గ్రామానికి దీపావళిగా నామకరణం చేసిన శ్రీకాకుళం రాజు
  • గ్రామ జనాభా దాదాపు వెయ్యి మంది
Where is Deepavali village

పండుగల పేర్లతో ఊర్లు ఉండటం సాధారణంగా చూసి ఉండం. అయితే దీపావళి పేరుతో ఒక ఊరు ఉంది. అది కూడా ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఈ గ్రామం ఉండటం విశేషం. శ్రీకాకుళం పట్టణానికి ఆనుకుని ఉన్న గార్ల మండలంలో ఈ గ్రామం ఉంది. ఈ ఊరికి ఈ పేరు రావడం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది.

గతంలో శ్రీకాకుళాన్ని పాలించిన ఒక రాజు కళింగపట్నానికి ఈ గ్రామం మీద నుంచే వెళ్లేవాడట. ఒక రోజు ఈ గ్రామం మీదుగా వెళ్తున్న సమయంలో ఎండ తీవ్రత ఎక్కువై ఆయన స్పృహ తప్పి పడిపోయాడట. వెంటనే అక్కడే పొలాల్లో పని చేసుకుంటున్న కూలీలు రాజును గుర్తించి సపర్యలు చేయడంతో ఆయన కాసేపటి తర్వాత కోలుకున్నాడు.

తనను కాపాడిన కూలీలకు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే ఆరోజు దీపావళి కావడంతో ఆ గ్రామానికి దీపావళిగా నామకరణం చేశాడట. ఇప్పటికీ రెవెన్యూ రికార్డులలో గ్రామం పేరు దీపావళిగానే ఉంది. ఈ గ్రామంలో దాదాపు వెయ్యి మంది జీవిస్తున్నారు. తమ గ్రామానికి పండుగ పేరు ఉండటం చాలా సంతోషంగా ఉందని గ్రామస్థులు అంటున్నారు.

More Telugu News