Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తాప్సి నిర్మించే సినిమాలో సమంత?
  • విజయ్ తెలుగు సినిమాకి స్క్రిప్టు రెడీ
  • మళ్లీ సినిమాలలోకి యాంకర్ సుమ   
Tapsi to produce a film with Samantha

*  'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సీరీస్ తర్వాత కథానాయిక సమంత హిందీ ప్రాజక్టులపై దృష్టి పెట్టిన విషయం విదితమే. ఈ క్రమంలో త్వరలో మరో కథానాయిక తాప్సి నిర్మించే చిత్రంలో సమంత కథానాయికగా నటించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సంప్రదింపులు ప్రస్తుతం జరుగుతున్నాయట.
*  ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్ త్వరలో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయనున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు దీనిని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పూర్తయిందని దర్శకుడు వంశీ తాజాగా వెల్లడించారు. ఈ ప్రాజక్టుకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ వచ్చే నెల నుంచి ఇస్తామని ఆయన చెప్పారు.  
*  ప్రముఖ టీవీ యాంకర్ సుమ మొదట్లో సినిమాలలోనూ, టీవీ సీరియల్స్ లోను నటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, పద్నాలుగేళ్ల క్రితం వచ్చిన 'ఢీ' సినిమా తర్వాత ఆమె మరే చిత్రంలోనూ నటించలేదు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఓ సినిమాలో ఆమె నటించనుంది. ఈ విషయాన్ని సుమ పరోక్షంగా వెల్లడిస్తూ, 'ఇంతమంది అడుగుతున్నారంటే.. చేసేస్తే పోలా?' అంటూ ట్వీట్ చేసింది. సో.. త్వరలోనే ఆమె మళ్లీ వెండితెరకు రానుందన్న మాట!

More Telugu News