Balakrishna: 'అఖండ' రిలీజ్ డేట్ ఖరారైనట్టే!

  • విభిన్నమైన పాత్రలలో బాలకృష్ణ
  • హైలైట్ కానున్న యాక్షన్ సీక్వెన్స్
  • ఆకట్టుకోనున్న శ్రీకాంత్ విలనిజం 
  • డిసెంబర్ 2వ తేదీన రిలీజ్ చేసే ఛాన్స్  
Akhanda movie update

బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో 'అఖండ' సినిమా రూపొందింది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందించాడు. బాలకృష్ణ సరసన నాయికగా ప్రగ్యా జైస్వాల్ నటించగా, ముఖ్యమైన పాత్రలో పూర్ణ కనిపించనుంది. ఈ సినిమాలో రైతుగా .. అఘోరగా బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు.

ఈ సినిమా దసరా బరిలో దిగుతుందని అంతా అనుకున్నారు. ఆ  తరువాత దీపావళికి వస్తుందనుకున్నారు. ఇక కొన్ని రోజులుగా .. డిసెంబర్ 24న ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ తాజాగా డిసెంబర్ 2వ తేదీ తెరపైకి వచ్చింది. మేకర్స్ ఈ డేట్ ను ఖాయం చేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది.

డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా త్వరలోనే ఎనౌన్స్ మెంట్ రానుందని అంటున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్ .. అఘోరా ఎపిసోడ్ .. తమన్ స్వరపరిచిన పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా శ్రీకాంత్ కనిపించనున్న సంగతి తెలిసిందే.

More Telugu News