Corona Virus: టీకా తీసుకున్నా వదలని కరోనా.. సోకడమే కాకుండా వ్యాప్తి కూడా!

  • బయట కంటే ఇంట్లోనే ఎక్కువగా కరోనా వ్యాప్తి
  • ‘ద లాన్సెట్ ఇన్‌ఫెక్షన్ డిసీజ్’లో అధ్యయన ఫలితాలు
  • ఇళ్లలో వైరస్ వ్యాప్తి టీకా తీసుకుంటే సరిపోదన్న అధ్యయనం
  • మరణం నుంచి కాపాడడంలో టీకాలు ప్రముఖ పాత్ర
Vaccination Saves from Life thretning

కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయని, దాని ప్రభావం రోజురోజుకు క్షీణిస్తోందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని మళ్లీ పెరుగుతున్న కేసులు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది.

వ్యాక్సినేషన్ తర్వాత కూడా వైరస్ బారినపడొచ్చని, అంతేకాక అలా పడిన వారి నుంచి మరొకరికి కూడా సోకే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. ఊరట కలిగించే విషయం ఏమిటంటే ఈ వ్యాప్తి చాలా స్వల్పంగా ఉండడం. బ్రిటన్‌లోని ఇంపీరియల్ కాలేజీ లండన్ శాస్త్రవేత్తలు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన విషయాలు ‘ద లాన్సెట్ ఇన్‌ఫెక్షన్ డిసీజెస్’లో ప్రచురితమయ్యాయి.

ఈ అధ్యయనం ప్రకారం.. టీకా తీసుకున్న వారిలో వైరస్ లోడు ఇతరులతో సమానంగానే ఉన్నప్పటికీ, ఇన్ఫెక్షన్ త్వరగా నయమవుతుంది. వైరస్ లోడు గరిష్ఠంగా ఉండడంతో వారి ద్వారా ఇంట్లోని వారికి వైరస్ సోకుతుంది. నిజం చెప్పాలంటే వైరస్ వ్యాప్తి బయట కంటే ఇంట్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతోందన్న విషయాన్ని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి.

 అయితే, వ్యాక్సిన్ తీసుకున్న వారి నుంచి డెల్టా వేరియంట్ వ్యాప్తికి సంబంధించిన వివరాలు మాత్రం అందుబాటులో లేవు. అయితే, కొవిడ్‌ను అదుపు చేయడంలో టీకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, తీవ్ర అనారోగ్యం, మరణం బారినుంచి కాపాడడంలో టీకాలు సమర్థంగా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇళ్లలో డెల్టా రకం వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు టీకా తీసుకోవడం మాత్రమే సరిపోదని తమ అధ్యయనంలో తేలిందని ఈ పరిశోధనకు సారథ్యం వహించిన ప్రొఫెసర్ అజిత్ లాల్‌వానీ వివరించారు.

More Telugu News