RBI: రఘురామకృష్ణరాజు విషయంలో.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖపై స్పందించిన ఆర్బీఐ

  • గత జులైలో కేంద్ర ఆర్థికశాఖకు విజయసాయి లేఖ
  • రఘురామ పవర్ ప్లాంట్ పై ఫిర్యాదు
  • లేఖలోని అంశాలను పరిశీలిస్తున్నట్టు ఆర్బీఐ వెల్లడి
  • నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని స్పష్టీకరణ
RBI responds to Vijayasai Reddy letter

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ ఏడాది జూలై 21న కేంద్ర ఆర్థికశాఖకు లేఖ రాశారు. ఇండ్ భారత్ థర్మల్ పవర్ ప్లాంట్ కు బ్యాంకు రుణాలపై విచారణ కోరారు. ఇండ్ భారత్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందినదని విజయసాయి తన లేఖలో వెల్లడించారు.

తాజాగా ఆ లేఖలోని అంశాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పందించింది. ఆర్బీఐ సీజీఎం జయశ్రీ గోపాలన్ ఎంపీ విజయసాయిరెడ్డికి లేఖ రాశారు. సదరు సంస్థ నిబంధనలు అతిక్రమించిందని నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. విజయసాయి లేఖలోని వివిధ అంశాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

More Telugu News