Nagashourya: సెన్సార్ పూర్తి చేసుకున్న 'వరుడు కావలెను'

  • నాగశౌర్య నుంచి 'వరుడు కావలెను'
  • ప్రేమ - పెళ్లి చుట్టూ తిరిగే కథ
  • దర్శకురాలిగా లక్ష్మీసౌజన్య
  • ఈ నెల 29వ తేదీన విడుదల  
Varudu Kaavalenu Censor Completed

నాగశౌర్య హీరోగా 'వరుడు కావలెను' సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను, దసరా పండుగకు విడుదల చేయాలనుకున్నారు. కానీ పోటీ ఎక్కువగా ఉండటంతో వెనక్కి తగ్గారు. ఆ తరువాత ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, U/A సర్టిఫికెట్ ను తెచ్చుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకి తమన్ - విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించారు. ఇంతవరకూ వదిలిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

 ఇటు యూత్ కి .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే  కంటెంట్ తో ఈ సినిమా రానుంది. నదియా పోషించిన పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. మురళీ శర్మ .. వెన్నెల కిషోర్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాతో నాగశౌర్యకి హిట్ పడుతుందేమో చూడాలి.

More Telugu News