TDP: నన్ను చేయిపట్టి లాగిన పోలీసులపై హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోండి: లోక్‌సభ స్పీకర్‌కు రామ్మోహన్‌నాయుడి లేఖ

  • టీడీపీ కార్యాలయంపై దాడులకు నిరసన
  • రెచ్చగొట్టే కార్యక్రమాలేవీ చేయకుండానే చేయిపట్టి లాగారన్న ఎంపీ
  • పోలీసులకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలంటూ లేఖ
TDP MP Ram Mohan Naidu writes letter to Lok Sabha Speaker Om Birla

తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తాను శాంతియుతంగా విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో శ్రీకాకుళం పోలీసులు తనను చేయిపట్టి లాగేశారని, విలేకరులను కూడా పక్కకు నెట్టేశారని ఆ లేఖలో పేర్కొన్నారు. తనను చేయిపట్టి లాగిన పోలీసులపై హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ నిన్న లేఖ రాశారు.

మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయంపై దాడులకు నిరసగా బంద్‌లో పాల్గొన్నామని, పోలీసులు బంద్ విఫలం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తామేమీ రెచ్చగొట్టే కార్యక్రమాలను చేపట్టలేదని, అయినప్పటికీ తన విషయంలో పోలీసులు హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పోలీసు అధికారులకు నోటీసులు ఇచ్చి వారిపై చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో రామ్మోహన్‌నాయుడు స్పీకర్ ఓం బిర్లాను కోరారు.

More Telugu News