Kanakamedala Ravindra Kumar: వైయస్ భారతి నిర్వహణలో ఉన్న సండూర్ పవర్ కోసమే కృత్రిమ విద్యుత్ కొరత సృష్టించారు: కనకమేడల

  • కేంద్రం సరిపడా బొగ్గును సరఫరా చేయడం లేదని అవాస్తవాలు చెపుతున్నారు
  • సింగరేణి, మహానది కోల్ ఫీల్డ్స్ కు ఏపీ ప్రభుత్వం రూ. 4,500 కోట్ల మేర బకాయి ఉంది
  • పవర్ ఫైనాన్స్ ద్వారా ప్రభుత్వం రూ. 25 వేల కోట్లను తీసుకొచ్చింది
AP govt artificially creating power crisis says Kanakamedala

రాష్ట్రంలో ఉన్నది విద్యుత్ కొరత కాదని... కృత్రిమ విద్యుత్ కొరత అని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. వైయస్ భారతి నిర్వహణలో ఉన్న సండూర్ పవర్ ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనడానికే కృత్రిమ విద్యుత్ కొరతను సృష్టించారని చెప్పారు. పవర్ ప్లాంట్లకు బొగ్గు కొరత ఉందని, కేంద్రం సరిపడా బొగ్గును సరఫరా చేయడం లేదని వైసీపీ ప్రభుత్వం అవాస్తవాలను చెపుతోందని విమర్శించారు.

సింగరేణి, మహానది కోల్ ఫీల్డ్స్ కు ఏపీ ప్రభుత్వం రూ. 4,500 కోట్ల మేర బకాయి ఉందని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, డిమాండ్ పై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వపర్ ఫైనాన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 వేల కోట్లను తీసుకొచ్చిందని... అందులో రూ. 6 వేల కోట్లను దారి మళ్లించిందని ఆరోపించారు.

More Telugu News