Star Maa: ప్రెస్ నోట్: ఎన్నెన్నో జన్మల బంధం... స్టార్ మా లో...

 
Star Maas New Daily Soap  Ennenno Janmala Bandham

ప్రెస్ నోట్:  కొత్తదనం వున్న కథలు... ప్రతి ఇల్లూ తనది అనుకునే ఎన్నో కుటుంబాల్ని తెలుగు ప్రేక్షకులకు తన ధారావాహికలతో పరిచయం చేస్తున్న స్టార్ మా ఈ సారి మరో వినూత్నమైన కథ తో ఓ కొత్త సీరియల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. దాని పేరు " ఎన్నెన్నో జన్మల బంధం".
 
అమ్మ ప్రేమ కోరుకునే ఓ పాపకి, అమ్మ అనే పిలుపు కోసం ఆరాటపడే ఓ అమ్మాయి, ఆ పాప తండ్రి మధ్య జరిగే ఓ విలక్షణమైన కథ ఇది. జీవితం లో ఎవరు ఎవరికి దూరమవుతారో, ఎవరు ఎవరికి దగ్గరవుతారో ఊహించలేని పరిస్థితుల్లో ఈ ముగ్గురి జీవితాలు ఎన్ని మలుపులు తిరిగాయనేదే ఈ సీరియల్ కథ లో ముఖ్యమైన ప్రయాణం.
 
కట్టిపడేసే భావోద్వేగాలు, కథాపరంగా అద్భుతం అనిపించే సన్నివేశాలు, పదునైన సంభాషణలు ఈ ధారావాహికని వినూత్నంగా అందిస్తున్నాయి. "ఎన్నెన్నో జన్మల బంధం" అనే పాత తెలుగు వారికి బాగా తెలిసిందే అయినా ఈ సీరియల్ కోసం కొత్తగా తయారై ప్రతి హృదయాన్ని తట్టి లేపింది. సీరియల్ కూడా పాటలాగే అందంగా, అందుకో చెప్పిన విషయంలాగా విలక్షణంగా వుండబోతోంది.
 
అక్టోబర్ 18న రాత్రి 9. 30 గంటలకి లాంచ్ అవుతున్న ఈ ధారావాహిక స్టార్ మా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి కలిగించబోతోంది.
 
"ఎన్నెన్నో జన్మల బంధం" ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/uko5vRrQL1g
 
"ఎన్నెన్నో జన్మల బంధం" పాట ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/7RzTrjyZ8q0
 
Content Produced by: Indian Clicks, LLC

More Telugu News