YS Sharmila: బ‌తుక‌మ్మ పండుగ సంద‌ర్భంగా పాట‌ విడుద‌ల చేసిన షర్మిల‌

  • నా తమ్ముడు ఏపూరి సోమన్న స్వయంగా రచించి, పాడాడు
  • సోమన్న పుట్టిన రోజు, బతుకమ్మ పండుగను పురస్కరించుకొని విడుద‌ల‌
  • ఆడపడుచులందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు
sharmila releases batukamma song

బ‌తుక‌మ్మ పండుగ సంద‌ర్భంగా వైఎస్సార్‌టీపీ ఓ పాట‌ను విడుద‌ల చేసింది. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆ పార్టీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

'నా తమ్ముడు ఏపూరి సోమన్న స్వయంగా రచించి, పాడిన బతుకమ్మ పాటను సోమన్న పుట్టిన రోజు సందర్భంగా, బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఈ రోజు విడుదల చేయడం జరిగింది. తమ్ముడు ఏపూరి సోమన్నకు జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఆడపడుచులందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు' అని ష‌ర్మిల పేర్కొన్నారు.

కాగా, తెలంగాణ‌ నిరుద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్ర‌తి మంగ‌ళ‌వారం ష‌ర్మిల‌ చేస్తోన్న‌ నిరాహారదీక్ష కార్యక్రమంలో భాగంగా ఈ  రోజు నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద ఆమె దీక్ష‌కు దిగనున్నారు.  

      

More Telugu News