Nagashourya: దసరా రేస్ నుంచి తప్పుకుంటున్న 'వరుడు కావలెను'?

  • నాగశౌర్య హీరోగా ఫ్యామిలీ ఎంటర్టైనర్
  • ముందుగా చెప్పిన విడుదల తేదీ ఈ నెల 15
  • రంగంలోకి అఖిల్ .. రోషన్ సినిమాలు
  • నాగశౌర్య తగ్గనున్నాడంటూ టాక్
Varudu Kavalenu release postponed

నాగశౌర్య హీరోగా 'వరుడు కావలెను' సినిమాను, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను పలకరించనుంది. తమన్ - విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా ఈ నెల 15వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్లను కూడా వదిలారు. అయితే ఇప్పుడు ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. మేకర్స్ ఈ సినిమాను నవంబర్ కి వాయిదా వేయనున్నారని అంటున్నారు.

అక్టోబర్ 14వ తేదీన 'మహాసముద్రం' విడుదల ఉన్నప్పటికీ, జోనర్ వేరు గనుక 'వరుడు కావలెను' ఆ మరుసటి రోజునే ఎంచుకుంది. ఆ తరువాత అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' .. రోషన్ 'పెళ్లి సందD' అదే రోజున వచ్చి చేరాయి. ఈ పోటీ కారణంగానే 'వరుడు కావలెను' వెనక్కి తగ్గినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. వాస్తవమెంతన్నది చూడాలి మరి.

More Telugu News