Bihar: రోడ్డుకు అడ్డంగా పెట్టిన బైక్ ను తీయమన్నందుకు.. పోలీసుపై చెయ్యిచేసుకున్న వ్యక్తి

  • బీహార్‌లో వెలుగు చూసిన వింత ఘటన 
  • పోలీసును కొడుతుంటే వారించి అడ్డుకున్న స్థానికులు 
  • కాసేపటికి బైక్ అక్కడే వదిలి పారిపోయిన నిందితుడు
Man beats up traffic police for asking him to move bike

రోడ్డుపై అడ్డంగా బైక్ ఆపావేంటని అడిగితే పోలీసులపైనే దాడికి దిగాడో వ్యక్తి. ఈ ఘటన బీహార్‌లోని జెహనాబాద్‌లో వెలుగు చూసింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం, ఒక వ్యక్తి నడిరోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగేలా బైక్ ఆపాడు. ఇది చూసిన ట్రాఫిక్ పోలీసు అతన్ని హెచ్చరించాడు.

రోడ్డుకు అడ్డంగా పెట్టిన బైక్‌ తీసేయాలని సూచించాడు. దీంతో ఆ వ్యక్తికి కోపం వచ్చేసింది. పోలీసుతో గొడవకు దిగాడు. అక్కడితో ఆగకుండా సదరు ట్రాఫిక్ పోలీసుపై చెయ్యిచేసుకున్నాడు. ఇదంతా చూసిన స్థానికులు అతన్ని అడ్డుకున్నారు.

ఆ తర్వాత సదరు నిందితుడు బైక్ అక్కడే వదిలేసి పరారయ్యాడు. బాధిత ట్రాఫిక్ పోలీసు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.

More Telugu News