Tamil Nadu: తమిళనాడులో ‘ఆపరేషన్ డిసార్మ్’ పేరుతో వేలాది మంది అరెస్టు

  • వివిధ హత్యల కేసులతో సంబంధాలున్న 3,325 మంది అరెస్ట్  
  • 1110 కత్తులు, ఏడు నాటు తుపాకులు స్వాధీనం
  • పలు దుకాణాలపై నిఘా పెట్టాలని డీజీపీ సూచన
3325 accused in murder cases arrested

తమిళనాడు రాష్ట్రంలో వివిధ హత్యల కేసులతో సంబంధాలున్న 3,325 మందిని పోలీసు శాఖ అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్టులన్నీ డీజీపీ సి. శైలేంద్రబాబు నేతృత్వంలోనే జరిగాయి. పోలీసు శాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ తనిఖీల్లో భాగంగా 1,110 కత్తులు, ఏడు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

‘ఆపరేషన్ డిసార్మ్’ పేరుతో హత్యల కేసులతో సంబంధాలున్న వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా వర్గపోరు కారణంగా నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నవారిని అరెస్టులు చేస్తున్నారు. ఇదే సమయంలో కత్తుల వంటి వస్తువులు అమ్మే దుకాణాలపై నిఘా పెట్టాలని, ఈ ఆయుధాలు తప్పుడు వ్యక్తులకు చేరకుండా పర్యవేక్షణ పెట్టాలని అధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆయుధాలు తయారుచేసేవారు, అమ్మేవారితో పోలీసులు సమావేశాలు నిర్వహించారు. మొత్తం 579 ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించగా, 2500 మంది వీటిలో పాల్గొన్నారని, వీరందరూ పోలీసులకు సహకరించడానికి అంగీకరించారని పోలీసు శాఖ తెలిపింది.

More Telugu News