Harish Rao: ఈటలకు అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి తెచ్చింది కేసీఆర్ కాదా?: హరీశ్ రావు

  • హుజూరాబాద్ లో పెరిగిన రాజకీయ వేడి
  • ప్రచారంలో తీవ్రత పెంచిన హరీశ్
  • గెల్లు శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి
  • అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని వెల్లడి
Harish Rao slams Eatala Rajendar

హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు మాటల్లో పదును పెంచారు. మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల మాట్లాడుతున్న మాటలు హుజూరాబాద్ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు.

'ఈటల నా తమ్ముడు, నా కుడిభుజం' అని కేసీఆర్ అంటే... సీఎంకే గోరీ కడతా అని ఈటల అనడం ఏం సంస్కృతి? అని హరీశ్ రావు మండిపడ్డారు. ఈటలకు అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి తెచ్చింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలని, మిగిలిన రెండున్నరేళ్లు గెల్లు శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వాలని నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 'శ్రీనివాస్ తో పాటు మీకు సేవ చేసే అవకాశం నాకూ ఇవ్వండి... అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం' అన్నారు మంత్రి హరీశ్.

More Telugu News