IPL 2021: రాజస్థాన్ రాయల్స్ సారధి సంజూ శాంసన్‌కు 24 లక్షల జరిమానా

  • ఢిల్లీతో మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో పూర్తికాని ఓవర్లు
  • స్లో ఓవర్ రేట్ కారణంగా శాంసన్‌కు ఇది రెండోసారి ఫైన్
  • పంజాబ్‌తో మ్యాచ్‌లో తొలిసారి జరిమానా
Sanju samson faces fine in second time in  a row

ఐపీఎల్ 2021 రెండో సెషన్ ప్రారంభమైంది. మొదలవడమే అభిమానులకు ఉత్కంఠ భరిత మ్యాచులను అందిస్తోందీ క్రికెట్ పండుగ. ఈ ఐపీఎల్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ సారధి సంజూ శాంసన్‌ మరోసారి జరిమానా ఎదుర్కొన్నాడు. పంజాబ్ జట్టుతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా శాంసన్‌కు తొలిసారి ఫైన్ పడింది.

అలాగే ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కూడా శాంసన్ ఇదే పొరపాటు చేశాడు. నిర్ణీత సమయంలో 20 ఓవర్ల కోటాను పూర్తిచేయలేకపోయాడు. ఈ కారణంగా అతనికి రూ. 24 లక్షల జరిమానా విధించారు. అలాగే జట్టు సభ్యుల మ్యాచ్ ఫీజులో కూడా 25 శాతం లేదా రూ. 6 లక్షలు ఏది తక్కువైతే అది ఫైన్‌గా వసూలు చేయనున్నారు.

కాగా, ఢిల్లీ-రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌లో పంత్ సారధ్యంలోని ఢిల్లీ జట్టు అద్భుత ఆటతీరు కనబరిచింది. అన్ని రంగాల్లో రాణించి 33 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. దీంతో మరోసారి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.

More Telugu News