Facebook: యూజర్ల భద్రత కోసం ఐదేళ్లలో 13 బిలియన్ డాలర్ల ఖర్చు: ఫేస్‌బుక్

  • 2016 నుంచి భద్రతపై సోషల్ మీడియా దిగ్గజం ఫోకస్
  • ఐదేళ్ల క్రితం ఈ విభాగంలో 10 వేల మంది ఉద్యోగులు
  • ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య 40 వేలపైనే అన్న ఫేస్‌బుక్
invested 13 billion dollars in security and safety says facebook

ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది ఉపయోగించే సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్. అయితే దీనిలో చాలా రకాల సమస్యలు ఉన్నాయని, వీటి గురించి ఆ సంస్థకు చెప్పినా పట్టించుకోవడం లేదని కొందరు ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఫేస్‌బుక్ సంస్థ స్పందించింది. యూజర్ల భద్రత, సంతృప్తి కోసం తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని చెప్పింది. అలాగే భద్రత, రక్షణ కోసం 2016 నుంచి భారీగా పెట్టుబడులు పెట్టామని తెలిపింది.

ఈ విభాగాల్లో ఐదేళ్ల కాలంలో 13 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టామని వెల్లడించింది. తమ కంపెనీలో ఈ విభాగంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను కూడా భారీగా పెంచామని తెలిపింది. ఐదేళ్ల క్రితం ఈ విభాగాల్లో 10 వేల మంది ఉద్యోగుల వరకూ పనిచేసే వారని చెప్పిన ఈ సంస్థ.. ప్రస్తుతం భద్రత, రక్షణ విభాగంలో 40 వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొంది.

ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో పలు సమస్యలున్నాయని, వీటి గురించి కంపెనీకి ఎన్నిసార్లు నివేదించినా పట్టించుకోవడం లేదని కొన్ని రిపోర్టులు పేర్కొన్నాయి. వీటిపైనే ఫేస్‌బుక్ సంస్థ వివరణ ఇచ్చింది. తాము ఎప్పుడూ వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పనిచేస్తామని తెలిపింది.

More Telugu News