Maoist: మావోయిస్టులకు ఎదురుపడిన పోలీసులు.. కాల్పులు జరుపుతూ తప్పించుకున్న నక్సల్స్

  • ఏవోబీలోని తులసిపాడు అటవీ ప్రాంతంలో ఘటన
  • వారోత్సవాలకు మావోయిస్టులు సిద్ధమవుతున్నట్టు పోలీసులకు సమాచారం
  • కూంబింగ్ కోసం వెళ్లిన పోలీసులను చూసి కాల్పులు
Fire Exchange between Police and Maoists

తమకు ఎదురుపడిన పోలీసులను చూసి అప్రమత్తమైన మావోయిస్టులు వారిపైకి కాల్పులు జరుపుతూ తప్పించుకున్నారు. ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కూంబింగ్ విధుల్లో ఉన్న పోలీసులకు తారసపడిన మావోయిస్టులు వెంటనే అప్రమత్తమయ్యారు. వారిపై కాల్పులు జరుపుతూ తప్పించుకున్నారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా తులసిపాడు అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.

మావోయిస్టులు వారోత్సవాలకు సిద్ధమవుతున్నట్టు తమకు సమాచారం అందిందని, దీంతో డీవీఎఫ్, ఎస్‌వోజీ బలగాలు తులసిపాడు అటవీ ప్రాంతానికి చేరుకున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో తారపడిన మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి తప్పించుకున్నట్టు తెలిపారు. పరారైన మావోల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.

More Telugu News