IPL 2021: ముగిసిన రాజస్థాన్ బ్యాటింగ్.. పంజాబ్ లక్ష్యం 186 పరుగులు

  • అర్థశతకానికి ఒక పరుగు దూరంలో అవుటైన జైస్వాల్
  • దుమ్మురేపిన యువప్లేయర్ మహిపాల్ లోమ్రార్
  • 8 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసిన రాజస్థాన్  
Jaiswal and Lomror strikes hard to put a strong target for Punjab

రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ అద్భుతంగా సాగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో బరిలో దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఎవిన్ లూయీస్ (36), యశస్వి జైస్వాల్ (49) పటిష్ఠమైన ఆరంభాన్నిచ్చారు. ఆ తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్ (4) నిరాశపరిచినా కూడా లియామ్ లివింగ్‌స్టన్ (25)కు తోడు మహిపాల్ లోమ్రార్ (43) ఇరగదీశాడు. కేవలం 17 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసి చివరకు అర్షదీప్ బౌలింగ్‌లో మార్క్రమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. రాహుల్ తెవాటియా (2), రియాన్ పరాగ్ (4), క్రిస్ మోరిస్ (5), చేతన్ సకారియా (7), కార్తిక్ త్యాగి (1) పరుగులు చేశారు. మొత్తం 20 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. పంజాబ్ ముందు పటిష్ఠ లక్ష్యాన్ని ఉంచింది. పంజాబ్ బౌలర్లలో యువపేసర్ అర్షదీప్ సింగ్ 5 వికెట్లతో సత్తా చాటాడు. మహమ్మద్ షమీ కూడా తన ఖాతాలో మూడు వికెట్లు వేసుకున్నాడు. ఇషాన్ పోరెల్, హర్‌ప్రీత్ బ్రార్ చెరో వికెట్ తీసుకున్నారు.

More Telugu News