YS Sharmila: పోలీసులు కేసీఆర్ తొత్తులుగా మారారు: ధ్వజమెత్తిన వైయస్ షర్మిల

  • ప్రతి మంగళవారం నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష
  • బోడుప్పల్ దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు
  • అయినా దీక్ష చేపట్టడంతో షర్మిల అరెస్టు
YS Sharmila angry on police after she was arrested

వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ప్రతి మంగళవారం నాడు నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఇవాళ బోడుప్పల్‌ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో దీక్ష చేయాలని నిర్ణయించారు. అయితే దీనికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయినా షర్మిల దీక్షకు దిగడంతో గ్రౌండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే షర్మిలను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు.

తొలుత ఉద్యోగం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న రవీంద్ర కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అనంతరం అనుమతి లేకపోయినా దీక్షకు కూర్చున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా షర్మిల మండిపడ్డారు. ‘‘పోలీసులు కేసీఆర్ తొత్తులుగా మారి శాంతియుతంగా దీక్షలు చేస్తున్న మాకు, అనుమతి ఇచ్చి, చివరి నిమిషంలో మాట మార్చి, మా దీక్షను భంగం చేసి, మా కార్యకర్తలని లాఠీలతో కొట్టి, మద్దతిస్తున్న యువతను అరెస్ట్ చేసి, నన్ను హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రాన మా నిరుద్యోగ దీక్షలు నోటిఫికేషన్లిచ్చే దాకా ఆగవు’’ అని స్పష్టం చేశారు.

More Telugu News