YSRCP: గుంటూరు జిల్లా పెదనందిపాడులో టీడీపీ మహిళా నేత ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి

  • గణేశ్ నిమజ్జనం సందర్భంగా వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ
  • ఎలాంటి కారణం లేకుండానే దాడికి దిగారన్న బాధితులు
  • భారీగా మోహరించిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు
YSRCP Workers Attacked tdp woman leader in guntur dist

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో టీడీపీ నేత, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు బత్తిని శారద ఇంటిపై వైసీపీ కార్యకర్తలు అర్ధరాత్రి రాళ్లతో దాడిచేశారు. ఇంట్లోకి ప్రవేశించి సామగ్రిని ధ్వంసం చేసి, ఇంట్లోని వస్తువులతోపాటు ఆరు బైకులపై పెట్రోలు పోసి నిప్పంటించినట్టు చెబుతున్నారు.

వినాయక నిమజ్జనం సందర్భంగా గత అర్ధరాత్రి వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ తర్వాత రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు శారద ఇంటిపైకి దాడి దిగినట్టు తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. ఎలాంటి కారణం లేకుండానే తమ ఇంటిపై దాడికి దిగారని శారద ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News