Congress: పంజాబ్​ లో సీఎం మార్పు.. శశిథరూర్​ లాగానే ఓ ‘కొత్త పదం’తో తన అభిప్రాయం చెప్పిన కాంగ్రెస్​ సీనియర్​ కపిల్​ సిబల్

  • ఉత్తరాఖండ్, గుజరాత్, పంజాబ్ పరిణామాలపై కామెంట్స్
  • ‘ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్’ అంటూ ట్వీట్
  • దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న అర్థం
Kapil Sibal Responds On Punjab CM Change In Shashi Tharoor Style

ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల మార్పులు జరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని మార్చారు. కొన్ని రోజుల క్రితం గుజరాత్ లో విజయ్ రూపానీ స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని తీసుకొచ్చారు. తాజాగా పంజాబ్ లో పార్టీ అధిష్ఠానం ఒత్తిళ్లతో అమరీందర్ తప్పుకొన్నారు.

ఈ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ తనదైన శైలిలో స్పందించారు. పార్టీలో పరిణామాలపై అసంతృప్తితో ఉన్న ‘జీ23’ వర్గం గురించి గతంలో సోనియా గాంధీకి లేఖ రాసిన ఆయన వార్తల్లో నిలిచారు. పార్టీలో నిర్మాణాత్మక మార్పులు జరగాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. తాజాగా వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల మార్పులకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శశిథరూర్ ఎప్పుడూ కొత్త కొత్త ఇంగ్లీష్ పదాలతో ఆకట్టుకుంటే.. ఇప్పుడు సిబల్ కూడా ఓ కొత్త పదంతో తన అభిప్రాయం చెప్పారు.

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. ‘‘అధికార మార్పులు. మొన్న ఉత్తరాఖండ్, నిన్న గుజరాత్.. ఇప్పుడు పంజాబ్. పాత సామెత చెప్పినట్టు.. ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ (ఎ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ నైన్). కాదంటారా?’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఎ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ నైన్ అంటే.. సమస్య చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించాలని, పెద్దగా అయ్యేదాకా ఎదురుచూడకూడదని అర్థం.

More Telugu News