Balakrishna: 'అఖండ' నుంచి బ్యూటిఫుల్ మెలోడీ రిలీజ్!

  • విభిన్నమైన కథా చిత్రంగా 'అఖండ'
  • బోయపాటితో బాలయ్య మూడో సినిమా
  • సంగీత దర్శకుడిగా తమన్
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు  
Akhanda lyrical video released

బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో 'అఖండ' సినిమా రూపొందింది. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, పూర్ణ ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.

'అడిగా అడిగా పంచప్రాణాలు నీ రాణిగా .. జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా' అంటూ ఈ పాట సాగుతోంది. తమన్ స్వరపరిచిన ఈ బాణీకి కల్యాణ్ చక్రవర్తి సాహిత్యాన్ని అందించాడు. ఎస్.పి. చరణ్ - ఎమ్.ఎల్.శ్రుతి ఆలపించారు. కలర్ఫుల్ గా చిత్రీకరించిన ఈ పాటలో బాలకృష్ణ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు.        

భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ఈ సినిమా నిర్మితమైంది.  రైతుగాను .. అఘోరగాను బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ సినిమాతో బాలకృష్ణ ..బోయపాటికి హ్యాట్రిక్ హిట్ పడుతుందేమో చూడాలి.

More Telugu News