Joe Biden: తనతో భేటికి చైనా అధ్యక్షుడు నో చెప్పాడనే వార్తలపై బైడెన్ స్పందన

  • అలాంటిదేమీ లేదని వివరించిన అమెరికా అధ్యక్షుడు
  • గతవారం ఇద్దరు నేతల మధ్య 90 నిమిషాల కాల్
  • జీ20 సమావేశంలో ముఖాముఖి కోసం ప్రతిపాదన
  • జిన్‌పింగ్ ఒప్పుకోలేదంటూ వార్తలు
biden denies claims that says china president xi turning down meeting

చైనాతో ముఖాముఖి చర్చల గురించి వినిపిస్తున్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ స్పందించారు. ఈ చర్చలకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ నో చెప్పారని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జరిగింది అది కాదని అమెరికా భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ ఇప్పటికే వివరణ ఇచ్చారు.

గత వారం బైడెన్, జిన్‌పింగ్ మధ్య 90 నిమిషాల పాటు ఫోన్ సంభాషణ జరిగింది. ఈ సమయంలోనే జిన్‌పింగ్‌తో ముఖాముఖి చర్చించాలనే ప్రతిపాదన చేశారట. దీనికి జిన్‌పింగ్ నిరాకరించినట్లు ఈ కాల్‌లో పాల్గొన్న కొందరు అధికారులు తెలిపారు. అయితే ఈ వార్తలను తాజాగా బైడెన్ ఖండించారు.

వచ్చే నెల జరగనున్న జీ20 సదస్సులో ఈ రెండు దేశాధినేతలు కలిసే అవకాశం ఉంది. ఇక్కడే ఈ ముఖాముఖి కార్యక్రమం జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి జిన్‌పింగ్ దేశం దాటింది లేదు.

ఈ క్రమంలోనే ఆయన సమావేశం ప్రతిపాదనను తోసిపుచ్చారని తెలుస్తోంది. అయితే చైనా విషయంలో అమెరికా కొన్ని నియమాలు మార్చుకోవాలని, అప్పుడే చర్చలకు ఆస్కారం ఉంటుందని జిన్‌పింగ్ చెప్పినట్లు సమాచారం.

More Telugu News